భారతదేశం, నవంబర్ 29 -- Yami Gautam Marriage Request To Aditya Dhar: తెలుగులో 'నువ్విలా', 'గౌరవం', 'కొరియర్ బాయ్ కళ్యాణ్' వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ యామీ గౌతమ్ తన 38వ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు.

నవంబర్ 28న తన భర్త, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్‌తో కలిసి అత్యంత సన్నిహితంగా ఈ వేడుకను నిర్వహించుకున్నారు. జీవితంలో తనకు దక్కిన ఈ మధుర క్షణాలకు ఎంతో కృతజ్ఞురాలిని అంటూ యామీ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను యామీ గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో యామీ నలుపు రంగు దుస్తులు, లాంగ్ కోట్ ధరించి ఎంతో హుందాగా కనిపించగా, ఆదిత్య నీలిరంగు సూట్‌లో ఆకట్టుకున్నారు.

ఒక ఫోటోలో ఆదిత్య తన భార్యను ఆప్యాయంగా హత్తుకుని పోజులివ్వగా, మరో ఫోటోలో అభ...