Yadadri District : ఫార్మా కంపెనీలో ప్రమాదం - రియాక్టర్ పేలి ఇద్దరు మృతి, 9 మందికి తీవ్ర గాయాలు
భారతదేశం, ఆగస్టు 22 -- తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పోచంపల్లి మండలం పరిధిలోని ధోతిగూడెం గ్రామంలో ఉన్న 'హేజెలో లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్' ఫార్మా కంపెనీలో హఠాత్తుగా సంభవించిన భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో తొమ్మిది మంది తీవ్ర అగ్నిగాయాల పాలయ్యారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి దాదాపు 10:30 గంటల ప్రాంతంలో ఫార్మా పరిశ్రమలో ఉన్నట్లుండి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పరిశ్రమలోని రియాక్టర్ పేలిపోవడమే ఈ భారీ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రతకు కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సమర్థవంతంగా స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.