భారతదేశం, ఏప్రిల్ 26 -- Best time for workouts : వ్యాయామం అనగానే మనం ఎన్ని సెట్లు చేస్తున్నాం, ఎంత బరువు ఎత్తుతున్నాం అనే దానిపైనే దృష్టి పెడతాం. కానీ ఏ సమయంలో వ్యాయామం చేస్తున్నాం అనేది పట్టించుకోము! కానీ టైమింగ్​ కూడా ఫలితాలపై ప్రభావం చూపుతుందా? ఉదయం పూట చెమట చిందించడం మంచిదా లేక రోజంతా పనులు ముగించుకుని సాయంత్రం జిమ్‌కి వెళ్లడం మేలా?

ఈ సందేహాలపై 'ఎనీటైమ్ ఫిట్‌నెస్ ఇండియా' నిపుణుడు కుశాల్ పాల్ సింగ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సమయం ఏదైనా సరే, మీ శరీరతత్వం, జీవనశైలిని బట్టి ప్రయోజనాలు మారుతాయని ఆయన స్పష్టం చేశారు.

చాలామంది ఫిట్‌నెస్ ఫ్రీక్స్ ఉదయాన్నే వర్కౌట్స్ చేయడానికి ఇష్టపడతారు. దీనికి ప్రధాన కారణం క్రమశిక్షణ.

కన్సిస్టెన్సీ: ఉదయాన్నే వ్యాయామం పూర్తి చేయడం వల్ల ఆ రోజంతా వచ్చే ఆఫీస్ మీటింగ్‌లు లేదా ఇతర పనుల వల్ల వర్కౌట్ మిస్ అ...