భారతదేశం, ఏప్రిల్ 18 -- Women Sleep Health : ఆడవారిలోని జీవక్రియలు మగవారికి భిన్నంగా ఉంటాయి. అడవాళ్ల ఆరోగ్యంపై పలు అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఇందులో భాగంగా నిద్ర విషయంలోనూ తేడాలుంటాయి. మహిళలతో పోల్చితే మగవారు వేగంగా నిద్రపోతారని.. మగవారితో పోలిస్తే ఆడవారు త్వరగా నిద్రపోలేరంట..! ఆడవారిలో నిద్ర నాణ్యత కూడా తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఇదే అంశాన్ని ప్రముఖ నిద్ర నిపుణులు, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ క్రిస్టోఫర్ జె. అలెన్ విశ్లేషిస్తూ. మహిళల నిద్రకు ఆటంకం కలిగించే ఆసక్తికరమైన కారణాలను పంచుకున్నారు. హార్మోన్ల హెచ్చుతగ్గుల నుంచి వారు మోసే 'మెంటల్ లోడ్' వరకు నిద్రపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వివరించారు.

మహిళల శరీరంలో హార్మోన్ల వ్యవస్థ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే రెండు హార్మోన్లు నిద్ర చక్...