భారతదేశం, ఏప్రిల్ 16 -- దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో పాటు కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు ఇందులో ఉన్నాయి.

మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో పార్లమెంటులో వాడివేడి చర్చ జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ 2 బిల్లులను ప్రవేశపెట్టగా. మరో బిల్లును కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా వీటిని ప్రతిపాదించారు. అనంతరం వీటిని సభలో ప్రవేశపెట్టేందుకు చర్చ చేపట్టారు. ఈ బిల్లులను విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. డివిజన్‌ ఓటింగ్‌కు పట్టుబట్టాయి. అందుకు స్పీకర్‌ ...