భారతదేశం, అక్టోబర్ 30 -- ఏపీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైన్‌షాపులు బంద్ కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని అన్ని వైన్ షాపులు, బార్లు, క్లబ్‌లు మూతపడనున్నాయి.

ఓట్ల లెక్కింపు చేపట్టే నవంబర్ 3వ తేదీన కూడా పూర్తిగా మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, గొడవలు జరగకుండా ఉండేందుకే ఈ డ్రై డేస్ నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దొంగచాటుగా మద్యం అమ్మకాలు సాగించినా, నిల్వలు ఉంచినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎ...