భారతదేశం, మార్చి 18 -- బాలీవుడ్ క్యూట్ కపుల్స్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లు విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్. ఒకరిపై ఒకరు కురిపించుకునే ప్రేమతో ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచే ఈ జంట గురించి ఇప్పుడు ఒక నెగెటివ్ చర్చ మొదలైంది. ఒక పెళ్లి వేడుకలో విక్కీ కౌశల్ సరదాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను వివాదంలోకి నెట్టాయి.

ఇటీవల ఒక వివాహ వేడుకకు హాజరైన విక్కీ కౌశల్, అక్కడ పెళ్లి కొడుకు తండ్రితో మాట్లాడుతూ తనదైన శైలిలో 'హౌ ఈజ్ ద జోష్' అంటూ సందడి చేశారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలే విమర్శలకు దారితీశాయి.

"నేను గమనించింది ఏంటంటే.. బ్యాచిలర్స్‌లో జోష్ ఎప్పుడూ హైగానే ఉంటుంది. కానీ మా లాంటి పెళ్లయిన వారిలో మాత్రం ఏటా ఆ జోష్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ కంగారు పడకండి.. నాలుగు రోజుల్లోనే ఆ జోష్ ఏమీ తగ్గిపోదు" అని విక్కీ కౌశల్ చమత్కరించారు....