భారతదేశం, నవంబర్ 24 -- ఆఫీసు పనుల కోసమో, ఫైళ్లు పంపుకోవడానికో కంప్యూటర్స్​లో 'వాట్సాప్ వెబ్' ఓపెన్ చేస్తున్నారా? పని పూర్తయ్యాక లాగౌట్ చేయకుండా నేరుగా బ్రౌజర్ విండో క్లోజ్ చేసి వెళ్లిపోతున్నారా? అయితే మీరు పెద్ద ప్రమాదంలో పడినట్లే! ఇతరులతో కలిసి వాడే షేర్డ్ కంప్యూటర్లు లేదా పబ్లిక్ సిస్టమ్స్‌లో వాట్సాప్ ఖాతాలను లాగిన్ చేసి వదిలేయడం వల్ల తీవ్రమైన సైబర్ ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4సీ) ఈ మేరకు ఒక కీలక అడ్వైజరీ జారీ చేసింది. యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్ల ద్వారా సైబర్ నేరగాళ్లు లేదా అనధికార వ్యక్తులు మీ వ్యక్తిగత సంభాషణలను చదవడమే కాకుండా, మీ ఖాతాను పూర్తిగా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఐ4సీ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్...