భారతదేశం, ఆగస్టు 4 -- రాష్ట్రంలోని దివ్యాంగులు స‌ద‌రం స‌ర్టిఫికెట్లు మ‌రింత సుల‌భంగా పొంద‌డానికి వీలుగా ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం మ‌రింత స‌ర‌ళ‌త‌రం చేసింది. దివ్యాంగులు ఇక‌పై స‌ద‌రం స్లాట్ బుకింగ్ కోసం మీ సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామ‌, స్వర్ణ వార్డు కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన ప‌నిలేదు. మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా వారు తామున్న చోటు నుంచి కేవ‌లం త‌మ మొబైల్ ఫోను ద్వారా ఇక‌పై ఈ ప‌నులు నిర్వహించుకోవ‌చ్చు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచ‌న‌ల ప్రకారం దివ్యాంగుల కోసం స‌ద‌రం సేవ‌ల‌ను మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా పొందే వీలు క‌ల్పించిన‌ట్లు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ఒక ప్రక‌ట‌న‌లో తెలిపింది. దీనివ‌ల్ల దివ్యాంగులు ఇక‌పై స‌ద‌రం స్లాట్ బుకింగ్‌, స్లాట్‌ ల‌భ్యత స‌మ‌యం, స‌ర్టిఫికెట్ డ...