భారతదేశం, జూలై 8 -- కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాల పేరిట వాట్సాప్ ప్రొఫైల్స్ సృష్టించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రట్టు చేసింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ లాగా నటిస్తూ.. సంస్థ ఉద్యోగిని నమ్మించి రూ. 4.70 కోట్లు కాజేసిన భారీ వాట్సాప్ బాస్(WhatsApp Boss Fraud) స్కామ్‌లో మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సరఫరా చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన వారిని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణ సాయి, ప్రస్తుతం హైదరాబాద్ కొత్తపేటలో ఉంటున్న (స్వస్థలం సత్తుపల్లి) మండవల్లి శివ నాగరాజుగా అధికారులు గుర్తించారు.

సైబర్ నేరగాళ్లు ఒక ప్రముఖ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పేరు, ఆయన ఫోటోను ఉపయోగించి నకిలీ వాట్సాప్ అకౌంట్‌ను సృష్టించారు. అనంతరం ఆ కంపెనీలో పనిచే...