WhatsApp : సడెన్‌గా వాట్సాప్ అకౌంట్లు బ్లాక్.. 'అండర్ రివ్యూ' నోటీసులతో యూజర్లకు షాక్!
భారతదేశం, ఆగస్టు 4 -- ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది! భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్ల అకౌంట్లు హఠాత్తుగా 'అండర్ రివ్యూ' (పరిశీలనలో ఉంది) లోకి వెళ్లాయి. సోమవారం రాత్రి నుంచి దాదాపు 24 గంటల పాటు వాట్సాప్ సేవలను ఈ అకౌంట్లు వినియోగించుకోకుండా సంస్థ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ముందస్తు హెచ్చరికలు లేకుండానే అకౌంట్లు నిలిచిపోవడంతో వేలాది మంది నెటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ సమస్య మొదలైంది. మెటా యాజమాన్యంలోని ఈ వాట్సాప్‌లో ఎలాంటి ముందస్తు నోటీస్ కనిపించకుండానే మెసేజ్‌లు, కాల్స్ వంటి సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకౌంట్ నిలిచిపోయిన వినియోగదారులకు వాట్సాప్ స్క్రీన్‌పై ఒక సందేశం ప్రత్యక్షమైంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.