భారతదేశం, ఆగస్టు 4 -- ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది! భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్ల అకౌంట్లు హఠాత్తుగా 'అండర్ రివ్యూ' (పరిశీలనలో ఉంది) లోకి వెళ్లాయి. సోమవారం రాత్రి నుంచి దాదాపు 24 గంటల పాటు వాట్సాప్ సేవలను ఈ అకౌంట్లు వినియోగించుకోకుండా సంస్థ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ముందస్తు హెచ్చరికలు లేకుండానే అకౌంట్లు నిలిచిపోవడంతో వేలాది మంది నెటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ సమస్య మొదలైంది. మెటా యాజమాన్యంలోని ఈ వాట్సాప్​లో ఎలాంటి ముందస్తు నోటీస్ కనిపించకుండానే మెసేజ్‌లు, కాల్స్ వంటి సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అకౌంట్ నిలిచిపోయిన వినియోగదారులకు వాట్సాప్ స్క్రీన్‌పై ఒక సందేశం ప్రత్యక్షమైంది....