భారతదేశం, జూన్ 26 -- Welcome To The Jungle Movie Review In Telugu: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో విభిన్న జోనర్ల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఒకవైపు దేశ విభజన నాటి ప్రేమకథలు, మరోవైపు రొమాంటిక్ కామెడీలు, ఇంకోవైపు హారర్ చిత్రాలు థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని పంచేందుకు ఒక క్రేజీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ తోడైతే ఆ మజానే వేరు. బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ 'వెల్‌కమ్' సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం 'వెల్‌కమ్ టు ది జంగిల్' (Welcome To The Jungle) నేడు (జూన్ 26) ప్రేక్షకులను పలకరించింది.

గతంలో వచ్చిన 'వెల్‌కమ్' (2007) చిత్రం సోషల్ మీడియాలో మీమ్స్ పరంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన 'వెల్‌కమ్ బ్యాక్' ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ద...