భారతదేశం, జూలై 27 -- ఫిట్‌నెస్ ప్రపంచంలో ప్రతిఒక్కరి ప్రధాన లక్ష్యం.. బరువు తగ్గడం లేదా శరీరాకృతిని సరిగ్గా ఉంచుకోవడం! దీనికోసం మార్కెట్‌లో ఎన్నో రకాల డైట్ ప్లాన్లు, వర్కౌట్ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇప్పటికీ మెజారిటీ ప్రజలు ఎంచుకునే సులువైన మార్గాలు రెండే: ఒకటి రోజువారీ నడక, రెండోది కార్డియో ఎక్సర్‌సైజ్. అయితే బరువు వేగంగా, ఆరోగ్యకరంగా తగ్గాలంటే రోజూ 10,000 అడుగులు వేయడం మంచిదా? లేదా నిత్యం 30 నిమిషాలు కష్టపడి కార్డియో వర్కౌట్ చేయడం ఉత్తమమా? అనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది.

ఈ రెండూ కూడా క్యాలరీలను కరిగించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడినప్పటికీ.. వీటి ద్వారా లభించే ఫలితాలు, మన శ్రమ, జీవనశైలి ఆధారంగా వేర్వేరుగా ఉంటాయి. అవి..

మరోవైపు, 30 నిమిషాల నిర్దిష్టమైన కార్డియో వ్యాయామాలు (రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ మొదల...