భారతదేశం, మే 13 -- Walking for weight loss : బరువు తగ్గడం ఒక ఎత్తు అయితే, తగ్గిన బరువును మళ్లీ పెరగకుండా చూసుకోవడం మరో ఎత్తు1 డైటింగ్ చేసి బరువు తగ్గిన వారిలో దాదాపు 80 శాతం మంది మూడు నుంచి ఐదేళ్లలో మళ్లీ పాత బరువుకు వచ్చేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా '8,500 అడుగుల' సూత్రాన్ని పరిశోధకులు సూచిస్తున్నారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీ (ఈసీఓ 2026) సదస్సులో ఈ అధ్యయన వివరాలను వెల్లడించారు.

దాదాపు 3,700 మందిపై జరిపిన ఈ విశ్లేషణలో శారీరక శ్రమకు, బరువు నియంత్రణకు మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

8,500 అడుగుల మ్యాజిక్ నంబర్: డైటింగ్ సమయంలోనే తమ శారీరక శ్రమను పెంచుకుని, రోజుకు సగటున 8,500 అడుగులు నడిచిన వారు.. డైటింగ్ పూర్తయ్యాక కూడా అదే బరువును కొనసాగించడంలో విజయవంతమ...