భారతదేశం, సెప్టెంబర్ 30 -- దసరా, దీపావళి వంటి రాబోయే పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపి కబురు అందించింది. వివిధ రాష్ట్రాలకు ప్రయాణించే వారి సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. చర్లపల్లి నుంచి హజ్రత్ నిజాముద్దీన్, చర్లపల్లి నుంచి సాసారామ్ మార్గాల్లో వీక్లీ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఈ ప్రత్యేక రైలు వారానికి ఒకరోజు చొప్పున మొత్తం 7 సర్వీసులు నడవనుంది. రైలు నంబరు 07021 (చర్లపల్లి - హజ్రత్ నిజాముద్దీన్) అక్టోబర్ 19, 2026 నుండి నవంబర్ 30, 2026 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. రైలు నంబరు 07022 (హజ్రత్ నిజాముద్దీన్ - చర్లపల్లి) అక్టోబర్ 21, 2026 నుండి డిసెంబర్ 02, 2026 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది.

చర్లపల్లి - హజ...