భారతదేశం, మే 10 -- వారం ప్రారంభంలోనే గ్రహాల స్థితిగతులు పలు రాశుల జాతకాలను మలుపు తిప్పబోతున్నాయి. ఈ వారం కొందరికి ప్రమోషన్లు, ఆర్థిక లాభాలను తెచ్చిపెడితే, మరికొందరికి ఓర్పును పరీక్షించే సమయంగా మారనుంది. ముఖ్యంగా కెరీర్ మార్పులు, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సంబంధాల విషయంలో గ్రహాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశ్లేషణ ఇక్కడ చదవండి.

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాశ్యాధిపతి మంగళుడు వ్యయ భావంలో శనితో కలిసి ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు ఎదురవుతాయి. అయితే, లగ్నంలో సూర్యుడు ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల మీకు కొత్త గౌరవం, ఉన్నత పదవులు లభిస్తాయి. వారం ప్రారంభంలో ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. వారం చివరలో రాజకీయ లబ్ధి, కోర్టు కేసుల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఆకుపచ్చని వస్తువులన...