భారతదేశం, నవంబర్ 22 -- నవంబర్ 22 నుంచి 28 వరకు లక్ష్మీ నారాయణ రాజయోగం, గురు మంగళ యోగం, మాలవ్య రాజయోగం ప్రభావం నెలకొంది. మేషం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఈ వారం ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుత ఫలితాలు దక్కుతాయి.

నవంబర్ 22 నుంచి ప్రారంభమవుతున్న కొత్త వారంలో గ్రహాల సంచారం ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. నవంబర్ 22న శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించగా, అక్కడ ఇప్పటికే బుధుడు సంచరిస్తున్నాడు. ఈ వారం సూర్యుడు వృశ్చిక రాశిలో ఉండగా, సింహ రాశిలో కుజుడు, గురువు, కేతువు కలిసి ఉన్నారు. శని మీన రాశిలో, రాహువు కుంభ రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు ఈ వారంలో మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల గుండా ప్రయాణిస్తాడు.

ఈ గ్రహ స్థితిగతుల వల్ల ఈ వారం మొత్తం లక్ష్మీ నారాయణ రాజయోగం, గురు మంగళ యోగం, మాలవ్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పంచాంగం, గ్...