భారతదేశం, ఫిబ్రవరి 26 -- విరోష్ వెడ్డింగ్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ మెనూలోని ఓ ఐటెం మరింత వైరల్ గా మారింది. ఈ రోజు ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ లో విరోష్ వెడ్డింగ్ జరిగిందని తెలిసింది. ఈ నేపథ్యంలో అతిథులకు వడ్డించే విందులో పంది మాంసంతో చేసిన స్పెషల్ పాండీ కూర కూడా ఉందని సమాచారం.

ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారని సమాచారం. ఉదయం 10.10 గంటల ముహూర్తంలో వీళ్ల పెళ్లి జరిగిందని తెలిసింది. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే అటెండ్ అయ్యారని టాక్. వీళ్ల కోసం ఏర్పాటు చేసిన విందులో పంది మాంసం కూడా ఉంది.

విరోష్ వెడ్డింగ్ విందు మోనూలో పంది మాంసాన్ని చేర్చడానికి ఓ బలమైన కారణం ఉందని తెలిసింది. రష్మిక మందన్న...