భారతదేశం, నవంబర్ 17 -- Web Series OTT: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ 'కాల్ మీ బే'. 2024లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో అదరగొట్టింది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఈ కాల్ మీ బే సిరీస్ నుంచి సీజన్ 2 రాబోతుంది. ఈ సీజన్ ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.

ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచిన 'కాల్ మీ బే' వెబ్ సిరీస్ సీజన్ 2 గురించి అమెజాన్ ప్రైమ్ వీడియో అదిరిపోయే అఫీషియల్ అప్డేట్ ఇచ్చింది. కామెడీ, సస్పెన్స్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా తదితర అంశాలతో తెరకెక్కుతున్న కాల్ మీ బే వెబ్ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ 17 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రైమ్ వీడియో ప్రకటించింది.

కాల్ మీ బే వెబ్ సిరీస్ సీజన్ 2 లో జోష్ ను మరింత పెంచేలా మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఎంట్రీ ఇవ్వబోత...