భారతదేశం, సెప్టెంబర్ 29 -- Web Series Actress: భోజ్‌పురి సినిమాలు, 10కి పైగా ప్రముఖ హిందీ వెబ్ సిరీస్‌లలో నటించిన ఒక వర్ధమాన నటి సెక్స్ రాకెట్ నడుపుతూ థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యభిచార దందాపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ (AHTC) అధికారులు పక్కా ప్లాన్‌తో దాడి చేసి ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు.

సినిమాలు, ఓటీటీ షోలలో అవకాశాలు ఇప్పిస్తామంటూ అమాయక మహిళలను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు విచారణలో వెల్లడైంది.

మహారాష్ట్రలోని థానే నగర పరిధిలో కొద్దిరోజులుగా రహస్యంగా ఒక హైప్రొఫైల్ వ్యభిచార రాకెట్ నడుస్తున్నట్లు ఏహెచ్‌టీసీ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అంజలి ఆంధలేకి ముందస్తు సమాచారం అందింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 26న మధ్యాహ...