భారతదేశం, జూలై 13 -- Web Series: విలక్షణ నటుడు కే కే మీనన్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త వెబ్ సిరీస్ 'ఆదర్శ్ బాల్ విద్యాలయ' (Adarsh Baal Vidyalaya) ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఒక అట్టడుగున ఉన్న ప్రభుత్వ పాఠశాలను లండన్‌లోని కేంబ్రిడ్జ్ స్థాయికి తీసుకెళ్లాలనుకునే హెడ్‌మాస్టర్ ప్రయత్నం, ఆ క్రమంలో ఎదురయ్యే నవ్వులు, ఎమోషన్స్ చుట్టూ తిరిగే ఈ హిలేరియస్ సిరీస్ ట్రైలర్ విశేషాలు, విడుదల తేదీ వివరాలు మీకోసం.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి వస్తున్న మరో క్రేజీ ఒరిజినల్ వెబ్ సిరీస్ ఇది. విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు కే కే మీనన్ లీడ్ రోల్‌లో నటించిన 'ఆదర్శ్ బాల్ విద్యాలయ' ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.

ఒక విభిన్నమైన విద్యా వ్యవస్థ నేపథ్యంలో చాలా ఫన్నీగా సాగే ఈ ఏడు...