భారతదేశం, జూన్ 18 -- Web Series: ఇండియన్ ఓటీటీ (OTT) వరల్డ్‌లో బెస్ట్ వెబ్ సిరీస్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లు 'పంచాయత్', 'ది ఫ్యామిలీ మ్యాన్', 'మీర్జాపూర్' లేదా 'పాతాల్ లోక్'. కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్‌లు కోట్ల మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాయి.

అయితే గ్లోబల్ రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎండీబీ (IMDb)లో ఈ పాపులర్ షోల కంటే అత్యధిక రేటింగ్ సాధించి, గత ఆరేళ్లుగా నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న ఒక హిందీ వెబ్ సిరీస్ ఉందనే విషయం మీకు తెలుసా? అవును బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన ఆ మాస్టర్‌పీస్ వెబ్ సిరీస్ రికార్డును ఇప్పటివరకు ఏ ఒక్క ఇండియన్ ఓటీటీ కంటెంట్ కూడా బ్రేక్ చేయలేకపోయింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఇచ్చే రేటింగ్స్ ఆధారంగా నడిచే ఐఎండీబీలో పదికి 9.2 మ...