భారతదేశం, ఆగస్టు 9 -- తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే కొన్ని గంటల్లో మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కోనుంది. ఇచ్చాపురం, కవిటి, సోంపేట, బారువ, పలాస, పాతపట్నం, టెక్కలితో పాటు వాటి పరిసర ప్రాంతాలలో రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి.

వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున విద్యుత్ స్...