భారతదేశం, జూలై 17 -- ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం విచిత్రంగా మారింది. గురువారం (జూలై 16) రాష్ట్రంలోని మధ్య ప్రాంతాల్లో తీవ్రమైన ఎండ, ఉక్కపోత, వడగాల్పుల వంటి పరిస్థితులు కొనసాగినప్పటికీ.. కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అమరావతి వాతావరణ కేంద్రం పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో గురువారం వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను మినహాయించి రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది.

వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ప్...