భారతదేశం, మే 31 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి భగభగలు కొనసాగుతుండగా.. మరోవైపు కొన్ని జిల్లాల్లో వర్షాలు ఊరటనిస్తున్నాయి. ఇవాళ (31-05-2026) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

వాతావరణ నివేదిక ప్రకారం.. ఇవాళ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు ఇవే:

ఈ ఐదు జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా ఆకస్మికంగా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పిడుగులతో కూడి ఉండే ప్రమాదం ఉన్నందున విపత్తు నిర్వహణ శాఖ ప్రజలన...