భారతదేశం, జూలై 20 -- ఆంధ్రప్రదేశ్‌లో రాగల 24 గంటల్లో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా తీరప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తాంధ్ర తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. విశాఖ, విజయనగరంలతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా అప్రమత్తత అవసరమని అధికారులు తెలిపారు:

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాలు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులు పడే ముప్పుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇ...