Weather Report : తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, ఐఎండీ అంచనాలు ఇలా
భారతదేశం, ఆగస్టు 5 -- తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంపై బలమైన ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ ఆవర్తన ప్రభావంతో రాబోయే రోజుల్లో ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు జోరందుకునే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ ప్రకారం. ఇవాళ (ఆగస్ట్ 05, 2026) ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడొచ్చు.
వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.