భారతదేశం, మార్చి 5 -- తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మార్చి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో దీని తీవ్రత ఎప్పటిలాగే గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(APSDMA) హెచ్చరించింది. మార్చి ప్రారంభం నుండి వేడి పరిస్థితులు తీవ్రం కావడం ప్రారంభించాయని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ అన్నారు.

'రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్, మే నెలలు తీవ్రంగా ఉండవచ్చు. వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది.' అని ప్రఖార్ జైన్ వెల్లడించారు.

శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మార్చిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. గుం...