భారతదేశం, నవంబర్ 6 -- Priyanka Chopra Supports To We Were Here Short Film: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థ మనుషుల ఉద్యోగాలను మింగేస్తోందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. రోజురోజుకూ విస్తరిస్తున్న సాంకేతికతపై ఒకవైపు భయాలు, మరోవైపు విశ్లేషణలు నడుస్తున్న వేళ.. ముంబైకి చెందిన యంగ్ డైరెక్టర్ ప్రణవ్ భాసిన్ ఒక సరదా ఆలోచనను అద్భుతమైన కథనంగా మలిచారు.

'వి వర్ హియర్' (We Were Here) పేరుతో ఆయన రూపొందించిన ఈ కామెడీ మాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై భారత్ పేరును మారుమోగిస్తోంది. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

చిన్న పట్టణానికి చెందిన ముగ్గురు రిటైర్డ్ అంకుల్స్ ఈ కథలో ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మనుషుల ఉద్యోగాలు పోతున్నాయని నమ్మే ఈ పెద్దాయనలు, ఏఐకి ఎదురుతిరగడానికి ఒక ...