భారతదేశం, ఏప్రిల్ 28 -- War 2 TV Premiere Date: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్. అతడు నటించిన తొలి బాలీవుడ్ మూవీ టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. స్పై థ్రిల్లర్ మూవీ వార్ 2 బుల్లితెరపై సందడి చేయబోతోంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ 'వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్'లో భాగంగా వచ్చిన ఈ మూవీ.. థియేటర్లు, ఆ తర్వాత ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైంది.

ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'స్టార్ మా' (Star Maa) వార్ 2 సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకుంది. తాజా అధికారిక ప్రకటన ప్రకారం ఈ ఆదివారం అంటే మే 3వ తేదీ సాయంత్రం 6:00 గంటలకు 'వార్-2' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానుంది. తెలుగులో ఈ మూవీ టెలికాస్ట్ అవుతుంది.

వారం అంతా పని ఒత్తిడిలో ఉన్నవారికి ఈ ఆదివారం సాయంత్రం ఒక పర్ఫెక్ట్ యాక్షన్ విందు ...