భారతదేశం, సెప్టెంబర్ 17 -- మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడానికి, యువ మహిళా క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్(WAPL)ను నిర్వహిస్తోందని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.

విజయవాడలోని ఏసీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సెప్టెంబర్ 19 నుండి 27 వరకు జరిగే ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌కు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి హాజరవుతారని చెప్పారు. డబ్ల్యుఏపీఎల్ ప్రస్తుత సీజన్‌లో నాలుగు జట్లు పోటీపడతాయన్నారు. అన్ని మ్యాచ్‌లు మంగళగిరి స్టేడియంలోనే జరుగుతాయని వెల్లడించారు.

ఈ మ్యాచ్‌లకు ప్రవేశం ఉచితమని చెప్పిన ఎంపీ, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. విద్యార్థులను విజయవాడ నుండి స్టేడియానికి తరలించడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు...