భారతదేశం, సెప్టెంబర్ 12 -- DC BMW Gifts Row Wamiqa Gabbi Producer: తమిళంలో క్లాసిక్ 'దేవదాస్' కథను సరికొత్త క్రైమ్ డ్రామాగా మలిచి తెరకెక్కించిన 'డీసీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న డీసీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ చిత్ర బృందానికి ఘనమైన నజరానా అందించింది.

సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ 'డీసీ' చిత్ర దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, హీరోగా నటించిన లోకేష్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌లకు సరికొత్త బీఎమ్‌డబ్ల్యూ (BMW) లగ్జరీ కార్ల ...