భారతదేశం, సెప్టెంబర్ 4 -- ప్రపంచ కార్ల తయారీ రంగంలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ ఉద్యోగాల కోతకు జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ సిద్ధమైంది. ఈ దశాబ్దం (2030) పూర్తయ్యేనాటికి తమ సంస్థ నుంచి మొత్తం లక్ష మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు యాజమాన్యం, కార్మిక సంఘాలు శుక్రవారం అధికారికంగా ప్రకటించాయి. గ్లోబల్ ఆటో ఇండస్ట్రీ చరిత్రలోనే ఇది అతిపెద్ద పునర్నిర్మాణ ప్రణాళికగా ఈ వోక్స్​వ్యాగన్ చర్య నిలవనుంది.

గతంలో ప్రకటించిన 50,000 ఉద్యోగాల కోతకు అదనంగా, మరో 50,000 ఉద్యోగాలను తగ్గించే ప్లాన్‌కు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. దానితో మొత్తం వోక్స్​వ్యాగన్ లేఆఫ్స్ సంఖ్య 1,00,000కు చేరింది. వోక్స్‌వ్యాగన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సిబ్బందిలో ఇది దాదాపు 15 శాతానికి సమానం. 2009లో అమెరికన్ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ (జీఎం) దివాళా తీసిన సమ...