భారతదేశం, మార్చి 30 -- విశాఖపట్నం నగరంలోని గాజువాక ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. వివాహితుడైన ఓ నేవీ ఉద్యోగి. మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. ఇటీవలే వీరిద్దరి మధ్య విభేదాల తలెత్తాయి. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాలు మౌనిక(28)ను ఇంటికి పిలిచి. అత్యంత దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలుగా కోసి సగ భాగాన్ని ఫ్రిడ్జిలో ఉంచి, మరో సగ భాగం మూట కట్టి ఇంట్లో మూలకు ఉంచాడు.

ప్రాథమిక వివరాల ప్రకారం.. ఇండియన్‌ నేవీలో రవీంద్ర అనే వ్యక్తి ఎయిర్‌ క్రాప్ట్‌ టెక్నిషీయన్‌గా పనిచేస్తున్నాడు. గాజువాక పరిధిలోని ఎల్‌వీనగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. రవీంద్రకు పెళ్ళై భార్య ఉండగా.. కైలాసపురం ప్రాంతానికి చెందిన మౌనిక (28) అనే వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

కొన్ని రోజుల కిందట రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆదివారం ప్రియుర...