భారతదేశం, జూన్ 29 -- స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బ్యాటరీ లైఫ్, డ్యూరెబులిటీకి ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారులను టార్గెట్ చేస్తూ వివో సంస్థ తన వై6ఏ స్మార్ట్​ఫోన్​ని ఇటీవలే చైనాలో లాంచ్​ చేసింది. స్క్వేర్ షేప్డ్ కెమెరా ఐలాండ్, పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్, సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​ అప్డేట్స్​ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాము..

చైనా మార్కెట్లో వివో వై6ఏ స్మార్ట్‌ఫోన్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది.

ధర: 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగా ఉంది (భారత కరెన్సీలో దాదాపు రూ. 28,000).

కలర్ ఆప్షన్లు: గెలాక్సీ సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్, ఫీనిక్స్ గోల్డ్ రంగులలో ఈ ఫోన్ వివో చైనా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.

డిస్‌ప్లే: ఈ వివో కొ...