భారతదేశం, ఏప్రిల్ 24 -- Vivo smartphones : వీవో తన లేటెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ వీవో వై6 5జీని చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్, ఫోన్ మన్నిక కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఉన్న 7,200ఎంఏహెచ్ బ్యాటరీ ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ఇతర బ్రాండ్లకు గట్టి పోటీనిస్తోంది.

వీవో వై6 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది:

8 GB + 128 GB: 1,799 యువాన్ (మన కరెన్సీలో సుమారు రూ. 24,000)

8 GB + 256 GB: 1,999 యువాన్ (సుమారు రూ. 27,000)

12 GB + 256 GB: 2,199 యువాన్ (సుమారు రూ. 30,000)

ఈ ఫోన్ గెలాక్సీ సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్, ఫీనిక్స్ వెల్కమ్స్ గోల్డ్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

ఈ వివో కొత్త స్మార్ట్‌ఫోన్ 6.75- ఇంచ్ హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్‌ప్లేతో వస్తుంది....