భారతదేశం, జూన్ 18 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో బడ్జెట్, మిడ్-రేంజ్ విభాగంలో మరో సంచలనానికి తెరలేపింది! వివో వై సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'వివో వై500 4జీ'ని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ సర్వం సిద్ధం చేసింది. ఇటీవల గూగుల్ ప్లే కన్సోల్ డేటాబేస్‌లో కనిపించిన ఈ స్మార్ట్‌ఫోన్, ఇప్పుడు అధికారికంగా లాంచ్ కాబోతున్నట్లు స్పష్టమైంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రమోషన్లను వివో ఇప్పటికే ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకునేలా దీని స్క్రీన్, బ్యాటరీ సామర్థ్యానికి సంబంధించిన కీలక వివరాలను కూడా కంపెనీ రివీల్ చేసింది.

వివో తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వివో వై500 4జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు సంబంధించిన టీజర్లను విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను పొరుగు దేశమైన నేపాల్‌లో మొదటగా లాంచ్ చేయనున్నట...