Vivo smartphones : వివో నుంచి 2 కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్- 7200ఎంఏహెచ్ బ్యాటరీతో!
భారతదేశం, జూలై 7 -- భారతదేశంలో బడ్జెట్ నుంచి ప్రీమియం శ్రేణి వరకు స్మార్ట్ఫోన్ల మార్కెట్లో వీవో బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకోవడానికి సరికొత్త ఆవిష్కరణలతో వచ్చే ఈ చైనా దిగ్గజం, తాజాగా తన స్వదేశీ మార్కెట్లో ఒకేసారి రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. 'వీవో జీ5ఐ', 'వీవో జీ5జెడ్' పేర్లతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బ్రాండింగ్ మినహా ఈ రెండు ఫోన్లలో వాడిన హార్డ్‌వేర్, డిజైన్, మెమరీ ఆప్షన్లు అన్నీ ఒకేలా ఉన్నాయి.
భారీ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్లను డిజైన్ చేశారు. సాధారణంగా మార్కెట్లో 5000ఎంఏహెచ్ లేదా 6000ఎంఏహెచ్ బ్యాటరీలతో ఫోన్లు వస్తుంటాయి. కానీ వీవో ఒకడుగు ముందుకు వేసి ఏకంగా 7,200ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ ఫోన్లలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.