భారతదేశం, జూలై 26 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'వివో'.. భారత మార్కెట్‌లోకి తమ కొత్త 'ఎస్' సిరీస్ ఫోన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో 'వివో ఎస్2' మోడల్ త్వరలోనే దేశీయంగా లాంచ్ కానుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ, ఫస్ట్ సేల్, దానికి సంబంధించిన ఒక ప్రమోషనల్ పోస్టర్ కూడా ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనిబట్టి ఈ ఫోన్ అధికారిక ప్రకటనకు ఎంతో సమయం లేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. వివో ఎస్2 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో ఆగస్టు 6న విడుదల కానుంది. ఆ తర్వాత ఆగస్టు 11 నుంచి దీని సేల్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ...