Vivo S2 : 7000ఎంఏహెచ్ బ్యాటరీతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్- ఇండియాలో 'ఎస్2' లాంచ్ డేట్ ఇదేనా?
భారతదేశం, జూలై 26 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'వివో'.. భారత మార్కెట్లోకి తమ కొత్త 'ఎస్' సిరీస్ ఫోన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో 'వివో ఎస్2' మోడల్ త్వరలోనే దేశీయంగా లాంచ్ కానుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ, ఫస్ట్ సేల్, దానికి సంబంధించిన ఒక ప్రమోషనల్ పోస్టర్ కూడా ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. దీనిబట్టి ఈ ఫోన్ అధికారిక ప్రకటనకు ఎంతో సమయం లేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. వివో ఎస్2 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో ఆగస్టు 6న విడుదల కానుంది. ఆ తర్వాత ఆగస్టు 11 నుంచి దీని సేల్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.