భారతదేశం, మార్చి 16 -- చాలా కాలం తర్వాత వెండితెరపై ఒక స్వచ్ఛమైన ఫ్యామిలీ డ్రామాను ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు తమిళ స్టార్ హీరో సూర్య. లక్కీ భాస్కర్, సార్ వంటి సూపర్ హిట్స్ అందించిన తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించిన లేటెస్ట్ మూవీనే 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath and Sons).

తాజాగా ఇవాళ (మార్చి 16) విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. సుమారు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ చిత్రంలో సూర్య 'సంజయ్ విశ్వనాథ్' అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రలో కనిపిస్తున్నారు. 40 ఏళ్ల వయసులో కూడా తన లక్ష్యం కోసం పోరాడే అథ్లెట్‌గా, మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో తండ్రిగా ఆయన పడే తపన టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా చేతిలో ఉన్న తుపాకీని వదిలి పాల సీసా ప...