భారతదేశం, మార్చి 2 -- వరుస ఫ్లాప్ ల నేపథ్యంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో హిట్ కొట్టేందుకు తమిళ స్టార్ హీరో సూర్య రెడీ అయిపోయాడు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమా టైటిల్ ను ఇవాళ (మార్చి 2) మేకర్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా పంచుకున్నారు.
సూర్య-వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాకు 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనే టైటిల్ నిర్ణయించారు. ఈ పేరును సోమవారం మేకర్స్ ప్రకటించారు. సినిమాకు పక్కా ఫ్యామిలీ టచ్ ఇచ్చేలా ఈ టైటిల్ ఉంది. ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను సితారా ఎంటర్ టైన్మెంట్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
''ఆయనతో ఉంటే శక్తి. ఆయన కౌగిలిలో వెచ్చదనం. హార్ట్ టచింగ్ ఫ్యామిలీ స్పెక్టాకిల్ తో వింటేజ్ సూర్య మ్యాజిక్ తిరిగొస్తుంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.