భారతదేశం, సెప్టెంబర్ 14 -- Vishwambhara OTT: మల్టీ-వర్స్ అండ్ సోషియో-ఫాంటసీ కాన్సెప్ట్‌తో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'విశ్వంభర'. కొంతకాలంగా నాన్-థియేట్రికల్ హక్కుల (డిజిటల్ అండ్ శాటిలైట్) విక్రయంలో ఆలస్యం జరగడం వల్ల ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. కాగా, తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం ఈ సినిమా డిజిటల్ బిజినెస్ పూర్తయింది.

​ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు విశ్వంభర డిజిటల్ రైట్స్‌ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కు ప్రధాన అడ్డంకిగా మారిన ఓటీటీ డీల్ క్లియర్ అవ్వడంతో, మేకర్స్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.

​'బింబిసార' వంటి బాక్సాఫీస్ విజయం తర్వాత దర్శకుడు వశిష్ఠ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్త...