భారతదేశం, మార్చి 11 -- మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా 'విశ్వంభర' చుట్టూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. వశిష్ట దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సోషియో-ఫాంటసీ మూవీ టీజర్ విడుదలైనప్పుడు, అందులోని పేలవమైన సిజిఐ (CGI) పట్ల మెగా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మూవీ టీమ్ ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి, లోపాలను సరిదిద్దే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇటీవల వదలా అనే ఓ మూవీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో 'విశ్వంభర' వంటి గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పాత్ర గురించి ఛోటా కె. నాయుడిని ప్రశ్నించారు. దీనికి అతడు సూటిగా స్పందించాడు. "...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.