భారతదేశం, మే 13 -- vishwambhara: చిరంజీవి ఫ్యాన్స్, సినీ లవర్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్న మూవీ 'విశ్వంభర'. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బిగ్ బజ్ తెగ వైరల్ గా మారుతోంది. విశ్వంభర రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే ఫ్యాన్స్ కు పండగే.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సోషియా ఫాంటసీ థ్రిల్లర్ మూవీ 'విశ్వంభర'. చెడుపై మంచి చేసే యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. కానీ బెటర్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం మూవీ రిలీజ్ లేటు అవుతూ వస్తోంది.

అయితే, తాజాగా ఓ బజ్ వైరల్ గా మారింది. ఆగస్టు 15, 2026న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశ్వంభర రిలీజ్ కానున్నట్లు తెలిసింది. స్పెషల్ డే అయిన ఇండిపెండె...