భారతదేశం, నవంబర్ 25 -- Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ అంటే రఫ్ గా ఉంటాడు, బోల్డ్ గా మాట్లాడతాడనే పేరుంది. ఆయన చేసిన సినిమాలు కావొచ్చు లేదా బయట మాటల ప్రభావం కావొచ్చు. కానీ విశ్వక్ సేన్ లోనూ ఓ ఎమోషనల్ యాంగిల్ ఉంది. తాజాగా ఈఎన్ఈ రిపీట్ మూవీ సక్సెస్ మీట్ లో అది బయటకు వచ్చింది.

కష్టాలు దాటితేనే ఎవరైనా సక్సెస్ అందుకుంటారు. హీరో విశ్వక్ సేన్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. సినీ ఇండస్ట్రీలో సెట్ కావడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. చాలా ఇబ్బందులు ఎదురుకున్నాడు. తాజాగా ఈఎన్ఈ రిపీట్ సక్సెస్ మీట్ లో ఈ విషయాలను విశ్వక్ సేన్ బయటపెట్టాడు.

తాను 17 ఏళ్ల నుంచే స్ట్రగుల్స్ ఫేస్ చేశానని విశ్వక్ సేన్ వెల్లడించాడు. 21 ఏళ్లకే తన దగ్గర డబ్బులు లేవని గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్లిపోయిందని అతను చెప్పాడు. ''21 ఏళ్లకు నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆమె నా దగ్గర పైసలు ...