భారతదేశం, నవంబర్ 20 -- Vishwak Sen: సోషల్ మీడియాలో హీరో విశ్వక్ సేన్ యాక్టివ్ గానే ఉంటాడు. తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటాడు. అదే సమయంలో తన మూవీపై నెగెటివి స్ప్రెడ్ చేసేవారి విషయంలో మాత్రం ఫైర్ అవుతాడు. తాజాగా విశ్వక్ సేన్ చేసిన ఇలాంటి ఓ ట్వీట్ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

విశ్వక్ సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఈఎన్ఈ రిపీట్' మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయాల్సిన టైమ్ లో విశ్వక్ సేన్ ఫుల్ కోపంతో ఊగిపోయాడు. ఎక్స్ లో ఓ పోస్టు పెట్టాడు. సీనియర్ జర్నలిస్ట్ వీఎస్ఎన్ మూర్తి (ఎక్స్ లో దేవి ప్రియ పేరుతో అకౌంట్)పై మండిపడ్డాడు.

''కుర్రాళ్ల గురించి, వాళ్ల టేస్ట్ గురించి, టెస్టోస్టిరాన్ గురించి అంచనాలు వేసేంత అప్డేటెడ్ మీరు ఉన్నారా? అని నా రివ్యూ. ఒక సినిమాను పొగడండి. కానీ మరో సినిమాను తక్కువ చేసి చూ...