భారతదేశం, ఫిబ్రవరి 27 -- టైటిల్: విష్ణు విన్యాసం

నటీనటులు: శ్రీవిష్ణు, నయన్ సారిక, బ్రహ్మాజీ, సత్య, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యాంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, గోపరాజు రమణ తదితరులు

దర్శకత్వం: యదునాథ్ మారుతి రావు

సంగీతం: రధన్

నిర్మాత: సుమంత్ నాయుడు జీ

విడుదల తేది: ఫిబ్రవరి 27, 2026

టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని పేరు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు నటించి లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ విష్ణు విన్యాసం. నయన్ సారిక హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహించారు. మరి ఇవాళ (ఫిబ్రవరి 27) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి విష్ణు విన్యాసం రివ్యూలో తెలుసుకుందాం.

ఒంగోలులోని ఓ జూనియర్ కాలేజీలో విష్ణు అలియాస్ చిన్ను (శ్రీవిష్ణు) జూనియర్ లెక్చర్‌గా వర్క్ చేస్తుంటాడు. జాతకాలను, వాస్తును బా...