భారతదేశం, ఆగస్టు 23 -- విశాఖపట్నం వేదికగా జరుగుతున్న బ్రిక్స్(BRICS) యువజన, క్రీడా శాఖ మంత్రుల సమావేశాలు 2026లో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్‌షిప్ సైక్లింగ్ ప్రోగ్రామ్ ఘనంగా ముగిసింది. ఈ సైక్లింగ్ ర్యాలీలో బ్రిక్స్ కూటమికి చెందిన సభ్య దేశాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో విదేశీ ప్రతినిధులు వైజాగ్ నగర అందాలను, తీర ప్రాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సైక్లింగ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగమైన సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంతో ఈ బ్రిక్స్ ర్యాలీ అనుసంధానమైందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1,800 నగరాల్లో ఒకే రోజు నిర్వహించిన ఈ సైక్లింగ్ డ్రైవ్‌లో దాదాపు 50 లక్షల మంది యువత ఉత్సాహంగా పాల్గొని సరి...